అంబులెన్స్ దొరక్క.. తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు..!

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ గానీ, ఇతర వాహనం గానీ దొరకలేదు. దీంతో చేసేదీ లేక ఆమె కొడుకు బైక్ పై  20 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.. మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి.చెంచుల(50) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుమారుడు మరో వ్యక్తి సహాయంతో బైక్ పై పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్ం చేర్చాడు. 

అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స అనంతరం స్కానింగ్ కోసం కాశీబుగ్గ గాంధీ నగర్ లో ఉన్న మరో ప్రైవేట్
ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ స్కానింగ్ అనంతరం తల్లి మృతి చెందింది. అయితే పలాస, కాశీబుగ్గ పట్టణంలో కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డైన్ విధించారు. కాగా, చెంచుల కరోనాతో చనిపోయిందని మృతదేహాన్ని స్వగ్రామం కిల్లోయి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్ సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో తల్లి మృతదేహాన్ని కుమారుడు బైక్ పై తీసుకెళ్లాడు. తప్పనిసరి పరిస్థితిల్లో బైక్ పై తీసుకెళ్తున్నామని చెంచుల కుమారుడు కన్నీరుపెట్టాడు. 

Leave a Comment