పాము పగపట్టింది..ఒకేనెలలో ఒకే పాము యువకుడిని 8 సార్లు కాటేసింది..!

పాములు నిజంగానే పగపడతాయా? అవుననే అంటోంది ఈ ఘటన..ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడిని ఒకే నెలలో 8 సార్లు కరిచింది. ఇల్లు వదిలి బంధువుల ఇంటికి వెళ్లినా..అక్కడికి వచ్చి మరీ కాటువేసింది. దీంతో ఆ యువకుడు వైద్యుల వద్ద చికిత్స పొందుతూ తన ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలోని రాంపూర్ లో యశ్ రాజ్ మిశ్రా అనే 17 యువకుడికి ఒక పాము ఎనిమిది సార్లు కాటువేసింది. పాటు కాటువేసిన ప్రతి సారీ స్థానిక వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నాడు. ప్లేస్ మారితే ఏమైన ప్రయోజనం ఉంటుందని ఆశించి ఆ యువకుడు బహదూర్ పూర్ లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. 

అయినా ఆ పాము వదల్లేదు. అదే పాము అక్కడికి వెళ్లి మరీ ఆ యువకుడిని కాటు వేసింది. పామును పట్టుకునేందుకు అందులో నైపుణ్యం ఉన్న వారిని పిలిపించారు. అయినా ఆ పాము దొరకలేదు. పాము పగ పట్టి ఉంటుందని, స్థానిక పూజారులతో పూజలు చేసినా ఫలితం లేదు. పాము ఏవైపు నుంచి వచ్చి కాటువేస్తుందో అంటూ ఆ యువకుడు వణికిపోతున్నాడు.  

Leave a Comment