8 ఏళ్ల తర్వాత కూడా అదే కోపం..!

భారత వెటరన్ బౌలర్ శ్రీశాంత్ దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. జనవరి 10 నుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి కేరళ జట్టు ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈక్రమంలో ఆ టోర్నీ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 8 ఏళ్ల తర్వాత మైదానంలోకి దిగినా శ్రీశాంత్ తీరు మారలేదు. మైదానంలో అదే కోపాన్ని చూపించాడు. ప్రాక్టీస్ లో సహచర బ్యాట్స్ మెన్ పై అతను స్లెడ్జింగ్ కి దిగడం అందర్నీ ఆశ్యర్యపరిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

కాగా శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు. దీంతో బీసీసీఐ శ్రీశాంత్ తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవిత కాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకు కుదించగా. గతేడాది సెప్టెంబర్ తో నిషేధం ముగిసింది. 2013 తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన శ్రీశాంత్ మునుపటి తరహాలోనే బంతులు వేస్తూ కనిపించాడు. బౌలింగ్ యాక్షన్ కొద్దిగా మారినప్పటికీ వేగంగానే అతను లయ అందుకుని వికెట్లు కూడా పడగొట్టాడు.  

Leave a Comment