కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రూ.1000.. సీరం కీలక ప్రకటన..!

కరోనా వ్యాక్సిన్ ధర విషయంలో సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోవిడ్ – 19 వ్యాక్సిన్ ను కేంద్రం ప్రత్యేక ధరకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే 200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామని స్పష్టం చేశారు. ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు, ఇతర అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. 

ఇందులో భాగంగా లాభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. అయితే 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే అందిస్తామన్నారు. అయితే ఆ ధర 200 రూపాయల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రైవేట్ మార్కెట్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ.1000 విక్రయిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను అందించడమే తమ ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. 

 

Leave a Comment