చేతిపై పురుషాంగాన్ని మొలిపించారు..!

పెరీనియం ఇన్ఫెక్షన్ తో పురుషాంగం కోల్పోయిన వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్సతో మళ్లీ అంగాన్ని మొలపించారు వైద్యుడు. కానీ అది ఎక్కడో తెలుసా…చేతి మీద..అవును ఇది నిజం…బ్రిటన్ కు చెందిన మాల్కమ్ డొనాల్డ్(45) జీవితంలో జరిగిన అద్భుతమిది. దీంతో చేతిపై పురుషాంగాలన్ని కలిగిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి అయ్యడు. 

వృత్తిపరంగా మెకానిక్ అయిన మాల్కం డొనాల్డ్ 2014లో పెరీనియం ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో అతని వేళ్లు, కాలి మరియు జననేంద్రియాలు నల్లగా మారిపోయాయి. చివరికు అతని పురుషాంగం ఊడి పడిపోయింది. ఇక ఇన్ఫెక్షన్ కూడా తీవ్రంగా మారింది. అది సెప్సిస్ కు దారితీసింది. వైద్యులు కూడా ఏమీ చేయలేమని చెప్పారు. 

ఈ పరిస్థితుల్లో అతని ఫ్యామిలీ డాక్టర్ ‘పెనిస్ మాస్టర్’గా పేరు ఉన్న ప్రొఫెసర్ డేవిడ్ రాల్ప్ గురించి చెప్పాడు. మాల్కం వెంటనే డేవిడ్ రాల్ఫ్ ను కలిసి పరిస్థితి వివరించాడు. ఇది విన్న డేవిడ్ పురుషాంగాన్ని అతడి చేతిపై మొలిపించవచ్చని తెలిపాడు. దానికి కనీసం రెండేళ్లు పడుతుందని చెప్పాడు. చికిత్సకు దాదాపు రూ.50 లక్షలు ఖర్చవుతాయని తెలిపాడు. ఈ వ్యయాన్ని భరించేందుకు అక్కడి  ప్రభుత్వం కూడా అంగీకరించింది. 

ఇంకేముంది..చికిత్స ప్రారంభించాడు. నాలుగేళ్ల క్రితం చికిత్స ప్రారంభమైంది. అతడి అంగానికి సంబంధించిన రక్త నాళాలు, నాడులను ఉపయోగించి కొత్త అంగం మొలిపించే ప్రక్రియను వైద్యులు మొదలుపెట్టారు. ఎడమ చేతి మీద చర్మాన్ని సేకరించారు. దానిని చుట్టు మూత్రమార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. చేతిపై పూర్తిగా పెరిగిన పురుషాంగాన్ని దాని సహజ స్థానంలోకి అమర్చే ఆపరేషన్ కోసం ప్రస్తుతం మాల్కం ఎదురు చూస్తున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా చికిత్స సాధ్యం కావట్లేదు. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.