భార్య శవాన్ని తన భుజాలపై మోసుకుని తీసుకెళ్లిన వృద్ధుడు..!

మహారాష్ట్రలోని నందురుబారులో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ లేకపోవడంతో ఓ వృద్ధుడు తన భార్యను భుజాలపై మోసుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి ఆరోగ్య శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఆ మహిళ మార్గమధ్యంలోనే చనిపోయింది. 

నందురుబారుకు చెందిన అదల్వా పాడ్వి, సుంగడి బైపాడ్వి భార్యాభర్తలు..బైపాడ్వికి ఏడాదిగా ఆరోగ్యం సరిగ్గా లేదు. సెప్టెంబర్ 2న ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ రోజు రాత్రి భారీ వర్షం పడింది. దీంతో ఉదయమే తలాడ ఆస్పత్రికి తీసుకెళ్లాలని భర్త అదల్వా పాడ్వీ అనుకున్నాడు. ఏదైన వాహనం దొరకుతుందేమోనని ఎదురుచూశాడు. ఏదీ దొరకలేదు. వారి ఇంటి నుంచి మెయిర్ రోడ్డు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో మెయిర్ రోడ్డు వరకు తన భార్యను భుజాన మోసుకుని వచ్చాడు. అక్కడ ఒక బైక్ పై ఆస్పత్రికి బయలుదేరారు.

 అయితే రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు బ్లాక్ అయింది. బైక్ వెళ్లేందుకు కష్టంగా మారింది. అయినా ఎలాగోలా బైక్ ను ముందుకు తీసుకెళ్లారు. అదల్వా పాడ్వీ తన భార్యను భుజాలపై మోసుకుని కొండచరియలు పడిన రోడ్డును దాటారు. తర్వాత మళ్లీ బైక్ పై కూర్చోని తలాడ చేరుకున్నారు. అప్పటికే సుంగడి బైపాడ్వీ చనిపోయారు. 

కానీ అక్కడ మరో వాదన వినిపిస్తోంది. మహిళను అంబులెన్స్ లో తీసుకొస్తున్నప్పుడు ఆమె దారిలో చనిపోయారని జిల్లా అధికారులు చెబుతున్నారు. అంబులెన్స్ లో మహిళను తీసుకుని బయలుదేరామని, అయితే కొండచరియలు పడటంతో అంబులెన్స్ అక్కడి చిక్కకుపోయిందని అధికారులు చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ మహిళ చనిపోయిందన్నారు. అయితే సుంగడి బైపాడ్వి కుటుంబ సభ్యులు మాత్రం తమకు అంబులెన్స్ దొరకలేదని చెబుతున్నారు. వాహనం ఏదీ దొరక్క పోవడంతో తన భార్యను కొంత దూరం భూజాల మీద, మరి కొంత దూరం బైక్ పై తీసుకెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు.  

 

Leave a Comment