బాల్కనీ నుంచి కింద పడబోయిన వ్యక్తి.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడాడు..!

బిల్డింగ్ పై నుంచి పడిపోతున్న ఓ వ్యక్తిని క్షణాల్లో స్పందించి పట్టుకున్నాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బిన్న, బాబు రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు కేరళ బ్యాంక్ వడకారా బ్రాంచ్ డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లారు. బ్యాంక్ భవనం మొదటి అంతస్తులో ఉంది. వీరిద్దరు కారిడార్ గోడకు ఆనుకొని మాట్లాడుకుంటున్నారు. 

ఆ సమయంలో బిను సడెన్ గా పై నుంచి కింద పడిపోతుండగా, బాబు రాజ్ క్షణాల్లో స్పందించి పట్టుకున్నాడు. ఆ సమయంలో అతని కాళ్లు మాత్రమే దొరికాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లంతా తలో చేయి వేసి అతన్ని పైకి లాగారు. అతడి ప్రాణాలు కాపాడారు. ఈ సన్నివేశం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment