వైరల్ వీడియో: కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టిన బామ్మ..!

దేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టే ఆటను ఎంతో ఉల్లాసంగా జరుపుతారు. ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా కూడా ఉంటుంది. అయితే ఒక వృద్ధ మహిళ ఉత్సాహంగా ఉట్టి కొట్టడానికి సిద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వృద్ధురాలు వయసు కేవలం సంఖ్య అని నిరూపిస్తోంది.. 

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు మహిళలు మానవ పిరమిడ్ లో ఏర్పడ్డారు. ఈక్రమంలో మహిళలపై ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను తన తలతో బద్దలు కొట్టింది. ఆ తర్వాత జాగ్రత్తగా కిందకు దిగింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్ష్ కాబ్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. ది ఇన్ క్రెడిబుల్ దాదీ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన వారు వృద్ధురాలిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Leave a Comment