ఆన్ లైన్ క్లాస్ ని హ్యాక్ చేసిన హ్యాకర్..!

ఆన్ లైన్ కాస్ లోకి ఓ హ్యాకర్ చొరబడి పోర్న్ వీడియో ప్లే చేశాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు ముంబై.. పిలే పార్లేలోని ఓ కాలేజ్ గత కొద్ది రోజులుగా తమ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. 

గతవారం ఆన్ లైన్ క్లాస్ జరుగుతుండగా ఓ హ్యాకర్ ప్రవేశించాడు. ఆన్ లైన్ క్లాసులో పోర్న్ వీడియో ప్లే చేశాడు. అప్పుడు ఆ క్లాసులు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు, మహిళా లెక్చరర్లు ఉన్నారు. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

ఇలా జరగడంతో ఆన్ లైన్ క్లాసును రద్దు చేశారు. వెంటనే కాలేజ్ యాజమాన్యం జుహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి కాలేజ్ సిస్టమ్ ను హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్లే చేశాడని, నిందితుడి ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని చెప్పారు.  

Leave a Comment