రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శనలో ‘రామ మందిరం’ నమూనాకే ఫస్ట్ ప్రైజ్..!

రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ పథ్ వద్ద వివిధ రాష్ట్రాల నుంచి పలు శకటాలను ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక శాఖ నిర్మాణంలో ఉన్న అయోధ్య ఆలయ నమూనా శకటాన్ని పరేడ్ అనంతరం ప్రదర్శించారు. ఈ శకటంపై వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నట్లు చూపించారు. 

రాముడి చిత్రంతో పాటు హనుమంతుడు సంజీవనిని తీసుకురావడం, జటాయు-రాముడు సంవాదం తదితర దృశ్యాలను శకటంపై ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల నుంచి  ప్రదర్శించిన శకటాల్లోకెల్లా రామాలయం నమూనా శకటం రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటానికి మొదటి బహుమతిని ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రైజ్ ని యూపీ ప్రభుత్వానికి అందజేనున్నారు. దీనిని రూపొందించిన కళకారులను, శకట తయారీదారులను ఆయన అభినందించారు.   

Leave a Comment