కరోనా సోకిన తొలి కుక్క మృతి..!

కరోనా మనుషులకే కాదు జంతువులను కబలిస్తోంది. తాజాగా కరోనా బారిన పడ్డ తొలి కుక్క చనిపోయింది. జంతువుల్లో ప్రపంచంలోనే తొలిసారిగా యూఎస్ఏలోని రాబర్ట్ అనే వ్యక్తి దగ్గర ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఏడేళ్ల కుక్కకు కరోనా సోకింది. అయితే ఇటీవల ఆ కుక్క మరణించినట్లు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ వెల్లడించింది. యూఎస్ఏలో ఈ కుక్క తర్వాత ఒక పులి, ఒక సింహం, 12 కుక్కలు, 10 పిల్లులకు కరోనా వచ్చినట్లు తేలింది.

ఏడేళ్ల జర్మన్ షెపర్డ్ ‘బడ్డీ’ ఏప్రిల్ మధ్యలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. మే నెలలో బడ్డీకి కరోనా పరీక్షలు నిర్వహించారు. జూన్ లో యూఎస్ వ్యవసాయ శాఖ దేశంలో కరోనా సోకిన మొదటి కుక్క జర్మన్ షెపర్డ్ అని నివేదించింది. కుక్క ఆరోగ్యం మరింత క్షీణించి జులైలో మరణించింది. 

Leave a Comment