ఆడపిల్ల పుట్టిందని రూ.40 వేల పానీపూరీని ఉచితంగా అందించిన తండ్రి..!

146
pani pori

ఆడపిల్ల పుడితే అయ్యో అనడం.. మగ పిల్లోడు పుడితే సంబరాలు చేసుకోవడం ఈ సమాజంలో చూస్తుంటాం. కానీ ఆ తండ్రి మాత్రం ఆడపిల్ల పుట్టిందని ఆనందంతో సంబరాలు చేశాడు. పానీపూరి వ్యాపారం చేసే ఆ చిరు వ్యాపారి తన షాపుకు వచ్చిన కస్టమర్లకు పానీపూరీని ఉచితంగా అందించి వారితో సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పానీ పూరీ వ్యాపారం చేసే 30 ఏళ్ల ఆంచల్ గుప్తాకు కూతురు కావాలని ఆశగా ఉండేది. కానీ మొదటి కాన్పులో అతని భార్యకు మగపిల్లోడు పుట్టాడు. దీంతో గుప్తా నిరాశకు గురయ్యాడు. కానీ రెండో కాన్పులో అతడి కోరిక తీరింది. ఆగస్టు 17న గుప్తా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంలో ఈ ఆదివారం తన షాపు వద్దకు వచ్చిన కస్టమర్లు అందరికీ ఉచితంగా పానీపూరి అందించాడు. రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు పానీపూరీని ఫ్రీగా పంచిపెట్టాడు. ఆడబిడ్డలతోనే భవిష్యత్తు ఉందని, పురుషులకు మహిళలు ఏమాత్రం తక్కువ కాదని గుప్తా అంటున్నాడు. కూతురు పుట్టిన ఆనందం ముందు ఈ ఖర్చు పెద్దది కాదని చెప్పాడు. పానీపూరీ ఫ్రీగా అందించడంతో అతడి షాపుకు ప్రజలు క్యూ కట్టారు. 

Previous articleదేవుడు, దేవాలయాలపై షాకింగ్ కామెంట్ చేసిన రేణు దేశాయ్..!
Next articleవామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here