రైతులే వైరు వంతెనను నిర్మించుకున్నారు…!

పొలం పనులు చేసుకోవాలంటే కాలువ దాటాలి. కానీ రెండెళ్ల క్రితం ఆ  కాలువపై వంతెన కూలిపోయింది. దీంతో రైతులకు సాగు భారంగా మారింది. పాలకులు గానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రైతులంతా ఏకమై వారే కాలువపై వంతెనను నిర్మించుకున్నారు. కూలిపోయిన బ్రిడ్జి స్థానంలో హ్యాంగింగ్ వంతెనను నిర్మించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం నుంచి త్యాజంపూడి వైపు ఉన్న పంట చేలకు వెళ్లేందుకు ఎర్రకాల్వపై వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాల్వపై వంతెనను పదేళ్ల క్రితం నిర్మంచారు. అయితే 2018లో ఆ వంతెన వరదలకు కొట్టుకుపోయింది.  నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఎలాగొల కాలువ దాటుకుంటు పోతారు. ఒక వేళ నీటి ప్రవాహం ఎక్కువైతే  10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వంతెన దాటాల్సి ఉంటుంది. అదీ కుదరకపోతే 25 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. వంతెన కోసం రెండున్నరేళ్లు అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ప్రాంత రైతులంతా సుమారు రూ.90 వేలతో విరిగిన వంతెనను కలుపుతూ వైర్లతో కాలిబాట వంతెనను నిర్మించుకున్నారు. 

Leave a Comment