బాబోయ్.. బస్సు ఆపి ఆహారం దొంగలించిన ఏనుగు.. వీడియో వైరల్..

బాబోయ్ ఈ ఏనుగు మహాముదురు. తన ఆహారం కోసం ఏకంగా హైవేపై బస్సు ఆపీ మరీ దోపిడీ చేసింది. శ్రీలంకలోని కటరంగమా ప్రాంతంలో హైవేపై ప్రయాణికులతో బస్సు వెళ్తుంది. ఆ బస్సును ఈ ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆపింది. 

దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. బస్సు ఆగగానే డ్రైవర్ కిటికీలో నుంచి తొండాన్ని జొప్పించి బస్సులోని బియ్యం, అరటిపళ్లను లాగేసుకుంది. ఈక్రమంలో ఏగుడు తొండం డ్రైవర్ మెడకు చుట్టుకుంది. దీన్ని విడిపించుకునేందుకు ఆ డ్రైవర్ నానా తంటాలు పడ్డాడు. ఇక తనకు కావాల్సిన ఆహారం లభించగానే ఆ ఏనుగు బస్సును వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిది.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

Leave a Comment