12వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. క్యాచ్ పట్టి కాపాడిన డ్రైవర్..!

వియత్నాంలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని 12వ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారిని డెలివరీ డ్రైవర్ పట్టుకున్నాడు. బాల్కీనీలో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. సరైన సమయానికి స్పందించిన డెలివరీ డ్రైవర్ ఆ చిన్నారికి క్యాచ్ పట్టుకున్నాడు.

చిన్నారి పడిపోయే సమయానికి ఎన్ గుడెన్ మన్ అనే వ్యక్తి డెలివరీ ఇవ్వడానికి అక్కడకు వచ్చాడు. అప్పటికి కాసేపటి ముందు నుంచి అతనికి ఆ చిన్నారి ఏడుపు వినిపించింది. చుట్టూ ఉన్న వాళ్ల అరుపులు కూడా వినిపించడంతో అతడు తన ట్రక్ నుంచి బయటకు దిగి చూశాడు. 

ఆ చిన్నారి బాల్కనీలో కనిపించింది. ఆమె కింద పడేలోపే ఆ బిల్డిండ్ బయట ఉన్న ఆరు అడుగుల ఎత్తు గోడ ఎక్కేశాడు. చివరి క్షణంలో ఎలాగోలా ఆ బాలికను పట్టుకున్నాడు. దీంతో ఆ పాప కాలికి చిన్న గాయం కాగా, ట్రక్ డ్రైవర్ చేతిలో ఎముక కాస్త విరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

    

Leave a Comment