క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి కోసం బ్యాట్ మెన్ గా మారిన వైద్యుడు..!

క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు ఓ వైద్యుడు బ్యాట్ మెన్ వేషం వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి కోరిక తీర్చడానికి వైద్యుడు చేసిన ప్రయత్నం నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఓ డాక్టర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి కోసం బ్యాట్ మెన్ గా మారిన వీడియో ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంటోంది. 

ఆ చిన్నారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ నీ కోరిక ఏంటని ఆ చిన్నారిని అడిగాడు. తన అభిమాన సూపర్ హీరో బ్యాట్ మెన్ ను కలవాలని ఉందని ఆ చిన్నారి తెలిపాడు. దీంతో కొంత సమయం తర్వాత ఆ డాక్టర్ బ్యాట్ మెన్ దుస్తులు ధరించి ఆస్పత్రి కారిడార్ లో చిన్నారికి ఎదురుగా వచ్చాడు. ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి తనని హత్తుకున్నాడు. క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడాలని ఆ చిన్నారిలో ధైర్యం నింపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  

  

Leave a Comment