లైంగికంగా వేధిస్తున్న కన్న తండ్రిని కాల్చేసిన కూతురు..!

బాల్యం నుంచి లైంగికంగా వేధిస్తూ నరకం చూపిస్తున్న కన్న తండ్రిని కిరోసిన్ పోలి కాల్చేసింది ఓ కూతురు.. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు కోల్ కతాకు చెందిన ఓ మహిళ తల్లి ఆమె బాల్యంలోనే చనిపోయింది. అప్పటి నుంచి అమ్మనాన్న తానే అయి కాపాడాల్సిన తండ్రి ఆమెను లైంగిక వేధించేవాడు. 

అప్పటి వరకు తండ్రి లైంగిక వేధింపులను భరించిన తనకు వివాహమైంది. తండ్రి వేధింపుల నుంచి బయటపడ్డానని అనుకుంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ తండ్రి వద్దకు వచ్చింది. దీంతో మళ్లీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఈ నరకం భరించలేని యువతి తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకుంది. 

ఈక్రమంలో రెండు రోజుల క్రితం తండ్రితో కలిసి రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించింది. ఆ తర్వాత ఇద్దరు హుగ్లీ నది ఒడ్డున ఉన్న బెంచీ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మందు ఎక్కువ కావడంతో తండ్రి నిద్రలోకి జారుకున్నాడు. అంతే తనతో తెచ్చుకున్న కిరోసిన్ ని తండ్రి మీద పోసి నిప్పంటించింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే చిన్న తనం నుంచి తండ్రి తనను లైంగికంగా వేధించాడని, ఆ వేధింపులు తట్టుకోలేక చంపేశానని విచారణలో అంగీకరించింది.   

Leave a Comment