లే నాన్న లే..అన్నం తెచ్చాను – రెండు రోజులు తండ్రి సమాధి వద్దే కూతురు

తన తండ్రి చనిపోయాడు. ఇక ఎప్పటికీ రాలేడు..కానీ ఆ కూతురుకు మాత్రం తన నాన్నే కావాలి. తన తండ్రి ఇక తిరిగిరాడని ఎంత చెప్పనా ఆ కూతురు వినలేదు.  రెండు రోజులు తండ్రి సమాధి వద్ద ఉండి ఏడుస్తూనే ఉంది. ఆ కూతురిని చూసి ఊరంతా కన్నీటి పర్యంతం అయ్యారు. 

జగిత్యాల జిల్లాలో కొండగట్టు బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 65 మంది చనిపోయారు. అందులో జిల్లాలోని కొడిమ్యల మండలం రాంసార్ కు చెందిన ద్యాగాల స్వామి కూడా చనిపోయాడు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అయింది. అయితే స్వామి కూతురు మాత్రం  తండ్రి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయింది.  తన తండ్రి చనిపోయిన రోజున సమాధి వద్ద వెళ్లి..‘ లేనాన్న లే..నీ ముద్దుల కూతురిని వచ్చాను..అన్నం తెచ్చాను..తిను నాన్న..లే నాన్న లే’ అంటూ ఏడ్చింది..  తిండి కూడా లేకుండా ఈ తొమ్మిదేళ్ల చిన్నారి సమాధి వద్ద ఏడుస్తుంది. మీ నాన్న రాడు.. చనిపోయి రెండేళ్లయింది..ఇంకా ఎన్నాళ్లు గుర్తు చేసుకుని ఏడుస్తావు అంటూ ఇంట్లో వారు, బంధవులు, గ్రామ ప్రజలు ఎంత చెప్పినా వినలేదు. 

Leave a Comment