కరోనా వైరస్ ను ల్యాబ్ లో తయారు చేశారు..ఆధారాలు ఉన్నాయి : వైరాలజిస్ట్

చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతం చేసింది.. ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బతీసింది. చైనానే కరోనా వైరస్ ను తయారు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను నిజం చేసేలా చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

చైనాలోని వూహాన్ లోనే కరోనా వైరస్ ను తయారు చేశారని, వూహాన్ ల్యబ్ లోనే ఈ ప్రయోగాలు చేసి పుట్టించారని చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ వెల్లడించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతానని తెలిపారు. బ్రిటన్ కు చెందిన ఓ టాక్ షోలో మాట్లాడిన లీ కరోనా వైరస్ గురించి చైనా చాలా విషయాలు దాచిపెడుతోందన్నారు. 

కరోనా వైరస్ విషయం చైనా, WHOలకు ముందే తెలుసన్నారు. రెండు విభిన్న వైరస్ లను కలిపి కరోనాను ఎప్పుడో సృష్టించారన్నారు. ప్రజలకు మాత్రం గతేడాది పరిచయం చేశారని ఆమె తెలిపారు. కరోనా వైరస్ ను వూహాన్ ల్యాబ్ లో తయారు చేశారని లి మెంగ్ స్పష్టం చేశారు. చైనా తనను హత్య చేయడానికి కూడా ప్రయత్నిస్తోందని, తప్పు అని నిరూపించడానికి ప్రచారం చేస్తోందని లీ ఆరోపించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గనని ఆమెవ స్పష్టం చేశారు. ప్రస్తుతం లి మెంగ్ యాన్ చైనా నుంచి అమెరికా పారిపోయారు. 

Leave a Comment