భారత్ లో పబ్జీ తో సహా 118 చైనా యాప్లను బ్యాన్ చేసిన కేంద్రం..!

లద్దాఖ్ లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తల తరుణంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్ లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీతో సహా 118 చైనా యాప్లను నిషేధించింది. భారత్ లో ఈ గేమింగ్ యాప్ ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. పబ్జితో పాటు బైడు, క్యామ్ కార్డు, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ తదితర యాప్లను ప్రభుత్వం నిషేధించింది. 

భారత దేశంలో పబ్జి యాప్ ను 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఈ గేమ్ కు యువత బానిసగా మారుతోంది. ఏ మాత్రం సమయం దొరికినా ఈ ఆటలోనే ఉండిపోతున్నారు. ఈ ఆట కోసం నిద్రాహారాలు మాని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చాలా కాలంగా పబ్జి గేమ్ ను బ్యాన్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పబ్జీని బ్యాన్ చేసింది. కాగా భద్రతా కారణాలతో టిక్ టాక్ తో సహా 106 చైనా యాప్ లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే..

Leave a Comment