పెళ్లికి ముందే వరుడి ప్రైవేట్ పార్ట్స్ చూడాలని కోరిన వధువు.. ఆ తర్వాత అతడికి చుక్కలు చూపించింది..

పెళ్లికి ముందే వధువు కోరిన కోరికను తీర్చి ఓ వరుడు చిక్కుల్లో పడ్డాడు. తన న్యూడ్ వీడియోను ఆ అమ్మాయికి పంపాడు. ఆ వీడియోను రికార్డు చేసిన ఆ కిలాడీ లేడీ తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ అతడిని వేధించింది.  

కర్నాటకలోని సౌత్ బెంగళూరు హులిమావు ప్రాంతంలోని ఆర్ఆర్ లేఅవులో నివాసం ఉండే ఓ 33 ఏళ్ల వ్యాపారవేత్త పెళ్లి సంబంధం కోసం జీవన్ సాతి అనే మ్యాట్రీమోనీ సైట్ ను ఆశ్రయించాడు. తన వివరాలను ఆ వెబ్ సైట్ లో నమోదు చేశాడు. ఈక్రమంలో అతడికి శ్రేయ అనే అమ్మాయి నుంచి రిప్లయి వచ్చింది. 

ఆ తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. తాను బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో నివసిస్తున్నట్లు చెప్పింది. తనకు మంచి ఉద్యోగం దొరకడం లేదని పేర్కొంది. దీంతో ఆ వ్యాపారవేత్త ఆమెకు జాబ్ ఓపెనింగ్స్ సంబంధించిన లింక్ లను పంపించాడు. ఈక్రమంలో వారి సంబంధం కూడా బలపడింది. ప్రతిరోజూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. 

పెళ్లయిన జంట లాగా మాట్లాడుకునే వారు. తరచూ ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వారు. ఈక్రమంలో ఫిబ్రవరి 7న శ్రేయ ఆ వ్యక్తిని వింత కోరిక కోరింది. అతని శరీర భాగాలు నార్మలా ఉన్నాయో లేదో చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. ముందుగా ఓ ఆమె ఓ ఫొటోను పంపింది. ఇది తన నగ్న ఫొటో అని చెప్పింది. 

దీంతో ఆ వ్యక్తి కూడా వీడియో కాల్ లో ఓపెన్ అయిపోయాడు. ఆ వీడియో కాల్ కట్ చేసిన కొద్ది సేపటికే ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. అతని నగ్న వీడియో రికార్డు చేశానని, తనకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. 

దీంతో ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. అయితే అంత డబ్బు ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పాడు. ఆ వీడియోను డిలీట్ చేయాలని కోరాడు. తొలుత ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాడు. తర్వాత మళ్లీ ఒత్తిడి చేయడంతో మరో రూ.5 వేలు పంపి ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. 

అయితే శ్రేయ వేరే నంబర్లతో కాల్ చేసి వేధించడం మొదలుపెట్టింది. అప్పుడు ఫోన్ పే ద్వారా మరో రూ.10 వేలు పంపాడు. ఆమెకు రూ.20 వేలు ఇచ్చినప్పటికీ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.