సన్నిలియోన్ పాటకు స్టెప్పులు వేసుకుంటూ పెళ్లి వేదికపై వచ్చిన వధువు..!

పెళ్లి వేదికలపై పెళ్లి కూతురును సంప్రదాయంగా తీసుకొస్తారు. పెద్దలు వెంటపెట్టుకుని మరీ మండపంలోకి తీసుకొస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ వధువు మాత్రం పెళ్లి వేదికపై చాలా డిఫరెంట్ గా వచ్చింది. బాలీవుడ్ నటి సన్నిలియోన్ పాటకు స్టెప్పులు వేసుకుంటూ పెళ్లి వేదికపై  వచ్చింది. 

మరాఠి సంప్రాదాయం ప్రకారం ముస్తాబై, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లికి హాజరైన వారు షాక్ అయ్యారు. చివరకు ఆమె వరుడి వద్దకు చేరుకుని అతని చేతిపై ముద్దు కూడా పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.  

Leave a Comment