చిన్నారిని మింగేసిన నాలా .. చెరువులో మృతదేహం లభ్యం..!

హైదరాబాద్ సిటీ నేరేడ్ మెట్ లో బాలిక మిస్ అయిన బాలిక సుమేధ విగత జీవిగా కనిపించింది. భారీ వర్షానికి చిన్నారి సుమేధ నాలాలో పడి మరణించింది. పాప మృతదేహాన్ని పోలీసులు బండ చెరువు వద్ద గుర్తించారు. బండ చెరుబు సుమేధ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉంది. 

చిన్నారి సుమేధ ఈనెల 17న సాయంత్రం 4.30 గంటలకు సైకిల్ పై ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. అయితే బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే ఓ నాలా వద్ద సుమేధ సైకిల్ దొరికింది. చిన్నారి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. సైకిల్ దొరికి నాలా నేరుగా బండచెరువులో కలుస్తుంది..దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు చెరువులో గాలించారు.. ఇంకేముంది.. చెరువులో సుమేధ  మృతదేహం లభ్యమైంది.

సెప్టెంబర్ 17న హైదరాబద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో కాకతీయ నగర్ నాలా పొంగి పొర్లింది.. రోడ్లపై ఉధృతంగా నీళ్లు ప్రవహించాయి. దీంతో సైకిల్ పై వెళ్తున్న సుమేధ అదుపుతప్పి నాలాలో పడిపోయింది. నాలాలో నుంచి బండ చెరువులోకి కొట్టుకునిపోయింది. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. పాపను చివరిసారిగా చూసేందుకు కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. ‘నా కూతురు మరణానికి కారణం ఎవరు.. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే నా కూతురు ప్రాణాలు కోల్పోయింది అని సుమేధ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ నా కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాం..ఆమె ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు’ అంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు.  

 

Leave a Comment