ఇండియాలో ఉపయోగించే ప్రసిద్ధ చైనీస్ యాప్స్ ఇవే..

మీరు మీ మొబైల్ ఫోన్లో ఎన్నో యాప్స్ వాడుతుంటారు. వాటిలో ఎన్నో యాప్స్ ఏ దేశం వారు రూపొందించారో మనకు తెలీదు. అది తెలియకుండానే మనం వాడేస్తుంటాం. ఈ యాప్స్ లలో ఎక్కువ శాతం చైనీస్ యాప్ లు ఉన్నట్లు మీకు తెలుసా? 

ప్రస్తుతం ఇండియాలో చైనా వస్తువుల వినియోగం బాగా పెరిగింది. చైనా నుంచి వచ్చే వస్తువులలో రసాయనాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి రిటైల్ వస్తువులు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో మన కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వస్తువులనే వాడాలనే నినాదాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ కూడా పెరిగింది. 

మనకు చైనాకు చెందిన వస్తువులు, ఫోన్లు మాత్రమే తెలుసు. అయితే చైనా చెందిన ఎన్ని స్మార్ట్ ఫోన్ యాప్లను మనం ఉపయోగిస్తున్నామో చాలా మందికి తెలియదు. అయితే ఈ యాప్ లను బ్యాన్ చేయడం సాధ్యమేనా..

మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ యాప్ల మార్కెట్ గా మారింది. దేశంలో 1.3 బిలియన్లకు పైగా సంభావ్య వినియోగదారులు ఉన్నారు. 

చాలా మంది భారతీయులను అనేక యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.  దీంతో చైనా యాప్ లు భారతీయ యాప్ల మార్కెట్ ను శాసిస్తున్నాయి. టిక్ టాక్ దగ్గర నుంచి హెలో యాప్ వరకు భారతీయులు అధికంగా వీటిని ఉపయోగిస్తున్నారు. అది కాక చైనా యాప్ లు భారతదేశంలో టాప్ లో ఉంటున్నాయి. అందుకు ఉదాహరణ టిక్ టాక్ యాప్. 

భారత దేశంలో టాప్ 100లో పాపులర్ చైనీస్ యాప్ లు..

 

సోసల్ కంటెంట్ ప్లాట్ ఫామ్Helo మరియు SHAREit
షార్ట్ వీడియో యాప్స్Tiktok, LIKE మరియు Kwai
వెబ్ బ్రౌజర్ యాప్UC Browser, UC Browser Mini
వీడియో మరియు లైవ్ స్ట్రీమింగ్ LiveMe, Bigo Live, Vigo vedio
యుటిలిటీ అప్లికేషన్స్BeautyPlus, Xender, Cam Scanner
గేమింగ్ యాప్స్ మరియు సాఫ్ట్ వేర్PUBG, Clash of King, Mobile Legends
ఈ కామర్స్ యాప్స్ClubFactory, Shein, Romwe

ఇండియాలో ప్రసిద్ధి చెందిన యాప్ లు..

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ అనువర్తనం Helo యాప్ ను చైనాకు చెందిన ప్రముఖ సంస్థ బైటెడాన్స్ ప్రారంభించింది. Helo యాప్ ఇప్పుడు ఉత్తమ భారతీయ సామాజిక వేదికలలో ఒకటి. దీనికి 40 కోట్ల మందికిపైగా యూజర్స్ ఉన్నారు. ఈ సామాజిక అనువర్తనం ఇండియాలో తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, బెంగాలీ, కన్నడ మరిన్ని భాషలలో ఉంది. 

టిక్ టాక్..

భారత దేశంలో ప్రసిద్ధి చెందిన యాప్ లలో ఇది ఒకటి. టిక్ టాక్ కు భారతదేశంలో మిలియన్ల కొద్ది యూజర్లు ఉన్నారు. టిక్ టాక్ ప్రపంచ వినియోగదారులలో 39 శాతం మంది భారతదేశానికి చెందినవారే. 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎక్కువగా టిక్ టాక్ ను వినియోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

భారతదేశంలో టాప్ 25 చైనీస్ యాప్స్..

  • Helo
  • TikTok
  • SHAREit
  • LIKE
  • Kwai
  • UCBrowser
  • UCBrowser Mini
  • LiveMe
  • Bigi Live
  • Vigo Video
  • Beauty Plus
  • Xender
  • Cam Scanner
  • PUBG
  • Clash Of King
  • Mobile Legends
  • ClubFactory
  • Shein
  • RomweApplock
  • VMate
  • Game of Sultans
  • Mafia City
  • Battle of Empires

Leave a Comment