ఒకే ఇంట్లో 8 మంది భార్యలతో..సంతోషంగా కాపురం..!

ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో సామరస్యంగా జీవించడం కష్టమవుతుంది.. ఎందుకంటే ఇద్దరు భార్యలు పరస్పర అంగీకారంతో నడుచుకుంటే పర్వాలేదు.. కానీ ఆ భార్యలు పంతానికి పోతే మాత్రం.. ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కానీ థాయ్ లాండ్ కి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో హ్యాపీగా కాపురం చేస్తున్నాడు.. వీరిలో ఇద్దరు గర్భవతులుగా ఉన్నారు.. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓంగ్ డ్యామ్ సోరోట్ అనే వ్యక్తి వృత్తిపరంగా టాటూ ఆర్టిస్ట్.. ఓ టీవీ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఓంగ్. తాను తన 8 మంది భార్యలతో చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. తన భార్యలు ఎప్పుడు ఒకరితో ఒకరు గొడవ పడరని, వారు తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారని తెలిపాడు. ఓంగ్ గురించి అతడి భార్యలు కూడా పాజిటివ్ గా స్పందించారు. ఈ భూమి మీద అత్యంత దయగల, బాధ్యతాయుత భర్త ఓంగ్ అని ప్రశంసించారు.. 

ఇంకో విషయం ఏంటంటే.. ఓంగ్ 8 మందిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. తొలి చూపులోనే ప్రేమించడం.. ప్రపోజ్ చేసి పెళ్లికి ఒప్పించడం చేశాడు.. అంతేకాదు తనకు పెళ్లయిన విషయాన్ని కూడా వారితో చెప్పాడు. అతడికి పెళ్లయ్యిందని తెలిసి కూడా ఆ 8 మంది ఓంగ్ ని పెళ్లి చేసుకున్నారు.. 

8 మంది భార్యలను ఎలా కలిశాడంటే.. 

ఓంగ్ తన మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో కలుసుకున్నాడు. అంతే చూసిన వెంటనే వెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆమె ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాడు.. రెండో భార్యను నాంగ్ నాన్ లోని ఓ మార్కెట్ లో చూసి పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యను ఆస్పత్రిలో కలిశాడు. నాలుగో భార్యను ఇన్ స్టాగ్రామ్ లో, ఐదో భార్యను ఫేస్ బుక్ లో, ఆరో భార్యను టిక్ టాక్ లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడో భార్యను తన తల్లితో కలిసి ఒక ఆలయానికి వెళ్లినప్పుడు చూసి పెళ్లి చేసుకున్నాడు. ఇక 8వ భార్యను ఎలా కలిశాడంటే.. ఓంగ్ తన నలుగురు భార్యలతో కలిసి పట్టయ్యాకు విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ 8వ భార్యను చూసి అక్కడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు.. 

ఇంకో విషయం ఏంటంటే.. ఓంగ్ తన మొదటి భార్య అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్యలు అంగీకరిస్తేనే మిగితా అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఓంగ్ అందరు భార్యలను సమానంగా చూస్తాడట.. వారి మధ్య ఎలాంగి గొడవలు రాకుండా చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడు. అందుకే ఓంగ్ భార్యల మధ్య ఒక్కసారి కూడా గొడవలు రాలేదట.. ఇక ఇంటర్వ్యూలో ఓంగ్ కి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారని అతడి భార్యలను ప్రశ్నించగా.. ఓంగ్ చాలా హ్యాండ్ సమ్ గా, కూల్ గా, కేరింగ్ గా ఉంటాడని, అందుకే చూడగానే నచ్చేసి పెళ్లి చేసుకున్నామని సమాధానం ఇచ్చారు.. ఓంగ్ ధనవంతుడు కూడా కాదు..అందరూ పనులు చేసుకుంటూ జీవినం కొనసాగిస్తున్నారు..     

Leave a Comment