ఎంత ఘోరం.. ఒకే సారి వంద కార్లు ఢీ !!

తీవ్రమైన మంచు తుఫాన్ తో దారీ పై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనివిని ఎరగని రీతి లో ఈ పెద్ద ప్రమాదం జరిగింది .
ఒకటి రెండు కాదు ఒకే సారి 100 వాహనాలు ఈ ప్రమాదానికి గురియ్యాయి . ఒకదానికొకటి డీ కొని కిలోమీటర్ మేర చిందరవందరగా పడిపోయాయి .
దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది .ఈ ప్రమాదం లో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు .

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం పోర్త్విత్ సమీపంలో 35 వ అంతర్జాతీయ రహదారి పై గురువారం ఉదయం ఈ సంగటన జరిగింది .
సంగటన జరిగిన ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్త గ పరిశీలిస్తూ అందులోని గాయపడి ఇర్రుకున్న వారిని బయటికి తీసి అవసరమైన చికిత్స అందిస్తున్నారు .భారీగా వాహనాలు దెబ్బ తినటం లో రహదారి పై అంతరాయం కలగకుండా ఉండటం కోసం వాటిని బయటికి తెస్తున్నారు .

చాలా వరకు పెద్ద పెద్ద కార్లు నుజునుజ్జు అయ్యి పోయాయి . జారుడుగా ఉండటం వాళ్ళ మంచు కారణం గ ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు .జారుడుగా ఉన్న ఆ మార్గం లో రాకపోకలు సాగించేందుకు సిబ్బంది సైతం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు . క్షతగాత్రులు
పెరుగుతూ ఉండటం తో వారికి చికిత్స అందించటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు .

ఫెడ్ఎక్ష్ కు చెందినా ఒక ట్రక్ అదుపు తప్పి బరియారు ని డీ కొని ఆగింది .వెనుక వచ్చిన మరి కొన్ని కార్లు ఆ ట్రక్ ని డీ కొని నిలిచిపోవటం తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు .టెక్సాస్ రాష్ట్రం లో షిర్లి మంచు తుఫాన్ కారణంగా జరిగిన ముగ్గురు చనిపోయారు అని అధికారులు తెలిపారు .ఈ మంచు తుఫాన్ ప్రభావంతో కెంటకి ,వెస్ట్ వేర్జినియలో సుమారు లక్షా 25 నివాసలకి విద్యుత్ సరఫరా నిలిచిపాయింది .

Leave a Comment