ఉగ్రవాదిని చంపకుండా కాపాడిన ఇండియన్ ఆర్మీ..!

ఇండియన్ ఆర్మీ ఓ ఉగ్రవాదిపై జాలి చూపించింది. తనను చంపొద్దంటూ ఆ ఉగ్రవాది వేడుకోవడంతో ఆ ఉగ్రవాదిని చంపకుండా అతని తండ్రికి అప్పచెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది.  ఇతని వద్ద ఏకే-47 రైఫిల్ ని స్వాధీనం చేసుకుంది. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద నిరోధక చర్యల సందర్భంగా ఓ ఉగ్రవాది ఇండియన్ ఆర్మీకి లొంగిపోయాడు. లొంగిపోయాక ఆ ఉగ్రవాదికి ఆర్మీ తాగడానికి మంచి, వేసుకోవడానికి డ్రెస్ ఇచ్చింది.  

ఈ ఉగ్రవాది పేరు జహంగీర్ భట్. ఈ మధ్యే ఇతడు ఉగ్రవాదుల్లోకి చేరాడు. రెండు రోజుల కిందటే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఉమ్మడి ఆపరేషన్ లో అతడిని గుర్తించింది. ప్రొటోకాల్ ప్రకారం అతడిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది ఇండియన్ ఆర్మీ. దీంతో జహంగీర్ లొంగిపోయాడు. 

తాను తప్పుదారిలో వెళ్లానని, తనకు ఉగ్రవాదులు తప్పుడు సమచారం ఇచ్చారుని ఆ యువకుడు తెలిపాడు. ఇకపై తాను ఉగ్రవాదంలోకి వెళ్లనని చెప్పాడు. తన కొడుకును అప్పగించినందుకు ఆ యువకుడి తండ్రి ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక జమ్మూకశ్మీర్ లో ఓ కుర్ర ఉగ్రవాది లొంగిపోవడం ఇదే మొదటిసారి..   

Leave a Comment