ఎన్ కౌంటర్ లో మరణించిన ఈ ఉగ్రవాది నాడు భారత జవాన్ల ప్రాణాలు రక్షించాడు..!

కశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆసిఫ్ ముజాఫర్ షా అనే ఉగ్రవాది మరణించాడు. అయితే ఈ ఉగ్రవాది గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 2014లో పాంపూర్ లో సంభవించిన వరదల్లో కొట్టుకుపోతున్న డజనుకుపైగా భారత్ సైనికుల ప్రాణాలను కాపాడాడు. అప్పుడు ఇతడిని ఆర్మీ అధికారులు సైన్యంలో చేరవలసిందిగా కోరినప్పటికీ తిరస్కరించాడని తెలిసింది.. 

అయితే ఇంత మంచివాడైన ముజాఫర్ గత ఆగస్టులో ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై వారిలో చేరిపోయాడు. బద్గాం జిల్లా చరారే షరీప్ దగ్గరి నవహార్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఆసిఫ్ మరణిచాడు. అయితే సైన్యం అతని గత చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యానికి గురైంది. 

Leave a Comment