తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..!

తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే..

ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయించే అబ్జెక్టివ్ విధానం ద్వారా పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని వెల్లడించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. 

Leave a Comment