ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా..!

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్ 7న జరగాల్సిన టెన్త్ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. 

కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని, విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సంప్రదింపులు చేస్తోందని, జేఈఈ, నీట్ వంటి ఎంట్రెన్స్ పరీక్షలకు మార్కులు అవసరమని మంత్రి స్పష్టం చేశారు.   

 

Leave a Comment