తెలుగు బిగ్ బాస్ తొలి మహిళ విన్నర్ బిందు మాధవి..!

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్.. ఈ షో విన్నర్ గా బిందు మాధవి నిలిచింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ విజేతగా నిలిచింది. కాగా.. ఫిబ్రవరి 26న ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో గ్రాండ్ ఫినాలే శనివారం జరిగింది. ఈసారి ఫైనల్ లో టాప్ 7 కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు.

 బాబా భాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్థక్, బిందు మాధవి టాప్ కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలో పోటీ పడ్డారు. వీరిలో అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్ ముందుగా ఎలిమినేట్ అయ్యారు. టాప్ 4లో అఖిల్, అరియానా, శివ, బిందు మాధవి ఉండగా..వారికి సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. 

అరియానా గ్లోరి ఈ సిల్వర్ సూట్ కేసు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆ సూట్ కేసులో రూ.10 లక్షలు ఉన్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాంకర్ శివ బయటకు వచ్చేశాడు. ఇక అఖిల్, బిందు మాధవి టాప్ 2 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరిలో బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. విన్నర్ గా నిలిచిన బిందు మాధవికి రూ.40 లక్షలు ప్రైజ్ మనీ లభించింది. మొత్తం ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా.. అందులో అరియానాకు ఇచ్చిన రూ.10 లక్షలను తీసివేస్తారు. ఆ మిగిలిన రూ.40 లక్షలను విన్నర్ కి ఇచ్చారు. 

 

 

 

Leave a Comment