నూతన హంగులతో తెలంగాణ కొత్త సచివాలయం

తెలంగాణ నూతన సచివాలయం డిజైన్ ఖరారైంది. ఎన్నో నూతన హంగులతో, హైటెక్ మాడల్ లో దీని నమూనాను రూపొందించారు. చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ రూపొందించిన ఈ నమూనాను తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. 

నూతన సచివాలయం మొత్తం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొత్త భవనానికి 20 శాతం స్థలం కేటాయించారు. మిగతా 80 శాతం స్థలంలో పార్కులు ఉండేటట్లు రూపకల్పన చేశారు. ఇక సచివాలయంలో మొత్తం 800 వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, అధికారులకు సంబంధించి 500 కార్లు, సందర్శకులకు సంబంధించి మరో 300 కార్లు ఇక్కడ నిలిపే ఏర్పాట్లు ఉంటాయి. సచివాలయంలో దేవాలయం, మసీదు కూడా నిర్మించనున్నారు. సిబ్బందికి సంబంధించి చిన్న పిల్లల కోసం క్రెచ్చ, బ్యాంక్, పోస్టాఫీసు, ఏటీఎంలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా..నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. 

Leave a Comment