‘జాబ్’ గురించి అడిగితే ‘హిజాబ్’ తెచ్చారు.. కేటీఆర్ సెటైర్..!

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చ ‘హిజాబ్’.. ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే చర్చ జరుగుతోంది.. కర్ణాటక ప్రభుత్వం పాఠశాలల్లో, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి వీల్లేదని జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కర్ణాటకలో వివాదం జరుగుతోంది. అయితే హిజాబ్ నిషేధంపై టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. మతపరమైన విషయాల్లో జోక్యం తగదని విదాస్తుంది. ఈ వాదనపై తెలంగాణ బీజేపీ కూడా వారి వాదన వినిపిస్తోంది..

తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై సెటైర్ వేశారు. హిజాబ్ వివాదాన్ని ‘జాబ్స్’కి ముడిపెడుతూ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ కార్టూనిస్ట్ రోహిత్ కబదే వేసిన సెటైరికల్ కార్టూన్ ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ కార్టూన్ లో ఏముందంటే.. ఓ వ్యక్తి తన చేతిలో ‘జాబ్..?’ అనే ప్లకార్డు పట్టుకుని ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రధాని మోడీ ప్లకార్డుపై ఉన్న ‘జాబ్’ని కాస్త ‘హిజాబ్’గా మార్చేస్తాడు. అంటే దేశంలో యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. బీజేపీ ప్రభుత్వం హిజాబ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అర్థం వచ్చేలా ఆ కార్టూన్ ఉంది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

 

 

Leave a Comment