రైతు వినూత్న ఆలోచన.. కోతులు పరార్..!

అటవీ ప్రాంతం నానాటికీ అంతరించిపోవుతుండటంతో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. దీంతో ఇవి జనావాసాలపై దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను, పండ్ల తోటలను దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని కోతుల బెడద అధికంగా ఉంది. 

మండలంలోని అన్నారం గ్రామంలోని పండ్ల తోటలను కోతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో గ్రామానికి చెందిన రైతు దొంగరి వెంకట్రామ్ తన పంటను కాపాడుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఓ పెద్ద పులి బొమ్మను కొనుగోలు చేశాడు. కోతుల గుంపు రాగానే తన పాలేరు ద్వారా ఆ పులి బొమ్మను తోటలో తిప్పుతున్నాడు. ఇలా చేయడంతో కోతులు మొత్తం పరారవుతున్నాయి.   

Leave a Comment