భార్య రొట్టెలు చేయలేదని.. సూసైడ్ చేసుకున్న భర్త..!

ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.. మరి కొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.. తాజాగా ఓ వ్యక్తి తన భార్య రొట్టెలు చేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన మహ్మద్ సాబేర్(30) బీడీఎల్ లో పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో సంగారెడ్డి జిల్లా పాశమైలారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి తన భార్యను రొట్టెలు చేయమని చెప్పాడు. అయితే భార్య రొట్టెలు చేయలేదు. దీంతో భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన సాబేర్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 

 

 

Leave a Comment