అయ్యో చిట్టి తల్లి.. కూల్ డ్రింక్ అనుకొని.. పురుగుల మందు తాగింది..!

కొమురం భీమ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగింది. దీంతో ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ కు చెందిన రాజేష్, లావణ్య దంపతులకు శాన్విక అనే ఐదేళ్ల కూతురు ఉంది. ఈ చిన్నారి గుండి గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతోంది.. 

చిన్నారి శాన్వికి పెద్దనాన్న ఇంటి వద్ద ఆడుకుంటుండగా అక్కడ ఓ కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. పొలానికి పిచారీ చేయగా.. మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ బాటిల్ లో నింపిపెట్టారు. అది కూల్ డ్రింక్ అనుకొని ఆ చిన్నారి తాగేసింది. వాంతులు చేసుకుంటూ ఇంటికి వెళ్లగా.. వాసన గనమించిన శాన్విక తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శాన్విక చికిత్స పొందుతూ మరణించింది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పురుగుల మందును కూల్ డ్రింక్ బాటిల్ లో ఉంచడంతోనే.. చిన్నారి అది కూల్ డ్రింక్ అనుకొని తాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. శాన్విక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. 

 

Leave a Comment