పెంపుడు కుక్కల కోసం ఎలుగుబంటితో పోరాడిన యువతి..!

ఓ యువతి ప్రానాలకు తెగించి తన పెంపుడు కుక్కలను ఎలుగుబంటి నుంచి కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలిఫోర్నియాలోని బ్రాడ్ ఫోర్ట్ లో గోడపై నడుచుకుంటూ ఓ ఎలుగుబంటి దాని రెండు పిల్లలు ఓ ఇంట్లో ప్రవేశించేందుక ప్రయత్నించాయి. 

ఇంట్లో పెంపుడు కుక్క, దాని పిల్లలు ఆ ఎలుగుబంటిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈక్రమంలో కుక్కలు గట్టిగా అరిచాయి. దీంతో పిల్ల ఎలుగుబంట్లు పారిపోయాయి. అయితే తల్లి ఎలుగుబంటి కుక్కలను ఎదిరించింది. ఇంతలో దీనిని గమనించిన ఇంట్లోని 17 ఏళ్ల హేలీ మోరినికో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎలుగుబంటిని గోడపై నుంచి కిందకు నెట్టేసింది. ఆ వెంటనే క్షణాల వ్యవధిలోనే పెంపుడు కుక్కలను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ ఘటన ఆ ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. యువతి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు..

Leave a Comment