టీమిండియా ఆటగాళ్ల డాన్స్.. స్టెప్పులు అదిరిపోలా..!

ఈనెల 24 టీమిండియా, ఇంగ్లండ్ ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని మొతారే స్టేడియంలో డేనైట్ టెస్టు జరగనుంది. ఈక్రమంలో టీమిండియా ఆటగాళ్లు మొతారే స్టేడియంలోని జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. జిమ్ చేస్తున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు తమ స్టెప్పులతో అదరగొట్టారు.

తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని ‘వాతి’ పాటకు రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ డ్యాన్స్ చేశారు. స్టేడియంలోని జిమ్ లో ఉత్సాహంగా చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను అశ్విన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టఉ చేేశాడు. అభిమానులు కూడా వాతి పాటకు డ్యాన్స్ చేసి చేసి #VaathiRaid హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని అశ్విన్ కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  

 

View this post on Instagram

 

A post shared by Ashwin (@rashwin99)

Leave a Comment