చెన్నై టెస్టులో టీమిండియా ఘన విజయం..!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 317 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను టీమిండియ చిత్తు చేసింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాంటింగ్ లో మొయిన్ అలీ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు తీసుకోగా, అశ్విన్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీసుకున్నారు. 

ఇక 482 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేపోయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు చెలరేగడంతో 164 పరుగులకే ఇంగ్లండ్ పరిమితమైంది. ఇక తొలి టెస్టు ఆడుతున్న ఆక్షర్ పటేల్ 5 వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు. అటు అశ్విన్ కూడా రెండు ఇన్నింగ్స్ లో 8 వికెట్లు పడగొట్టాడు. 

కాగా, మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 329 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 161 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే పరిమితమైంది. అశ్విన్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. 

రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 286 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 482 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 106 పరుగులతో సెంచరీ సాధించి వీరవిహారం చేశాడు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడింది. 164 పరుగులకే ఇంగ్లండ్ ను కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు.. దీంతో 317 పరుగులతో ఇంగ్లండ్ పరాజయం పొందింది. ఇక మూడో టెస్టు ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.  

 

 

 

Leave a Comment