స్టార్ హీరో కూతురి ప్రేమలో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్..!

టీమిండియా ఓపెనర్ కెేఎల్ రాహుల్ బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నాడు. అతియా బర్త్ డే సందర్భంగా తన ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు రాహుల్.. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. 

టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ చెలరేగి ఆడాడు. ఈ ప్రపంచకప్ లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అదే రోజుల తన ప్రేయసి, నటి అతియా శెట్టి పుట్టినరోజు కూడా. దీంతో మైదానంలో అద్భుతంగా ఆడి తన గర్ల్ ఫ్రెండ్ కు మంచి బహుమతిని అందించాడు. 

రాహుల్ ఆడుతుంటే స్టాండ్స్ లో అతియా కేరింతలు కొడుతూ కనిపించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా లండన్ లో రాహుల్ తో కలిసి అతియా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమల్స్ చక్కర్లు కొట్టాయి. తనపై ఉన్న రూమర్స్ ను నిజం చేస్తూ అతియాతో ప్రేమలో ఉన్న విషయాన్ని రాహుల్ బయటపెట్టాడు. 

 

 

View this post on Instagram

 

A post shared by KL Rahul👑 (@rahulkl)

Leave a Comment