ఇంగ్లండ్ పై టీమిండియా ఘోర పరాజయం..!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమి చెందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 420 స్కోరును ఛేధించే క్రమంలో టీమిండియా 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 227 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. చివరి రోజు పిచ్ పై రెండు సెషన్ల పాటు కూడా నిలవలేక చేతులెత్తేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. 

కెప్టెన్ కోహ్లీ 72 పరుగులు, శుభ్ మన్ గిల్ 50 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. రహానే, వాషింగ్టన్ సుందర్, నదీమ్ డకౌట్లుగా వెనుదిరిగి దారణంగా విఫలమయ్యారు. ఇక టీమిండియా మరో వాల్ పుజారా కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఇక మొదటి ఇన్నింగ్స్ లో రాణించిన పంత్ కేవలం 11 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, ఆండర్సన్ 3 వికెట్లు తీసుకోగా, స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, డామ్ బెస్ తలో వికెట్ తీసుకున్నారు. ఇక రెండో టెస్టు చెన్నై వేదికగా ఫిబ్రవరి 13న ప్రారంభం కానుంది. 

 

Leave a Comment