తండ్రి అయిన విరాట్ కోహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. సోమవావరం కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయన్ని కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాపై చూపిన ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క ఆరోగ్యంగా ఉన్నారు’ అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు. 

2017 డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. కాగా, 2021 జనవరిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని గత ఏడాది ఆగస్టు నెలలో కోహ్లీ, అనుష్క శర్మ వెల్లడించారు. తాము ముగ్గురం కాబోతున్నామని, ఓ బేబీ రానుందని నటి అనుష్క శర్మ సైతం తాను గర్భం దాల్చిన విషయాన్ని చెప్పారు. 

Leave a Comment