టీని ఇలా చేసి తాగితే చాలా ప్రమాదం తెలుసా?

మన ఇండియాలో ప్రజలు ఎక్కువగా టీ తాగుతూ ఉంటారు. కొందిరి ఇళ్లల్లో అయితే రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతారు. ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా..ఇంటి పనులతో తలమునకలైనా మొదట గుర్తొచ్చేది టీనే.. ఒక కప్పు చాయ్ తాగడం వల్ల అప్పటి వరకు ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. అయితే కొందరు మాత్రం ఒకేసారి పెద్ద మొత్తంలో టీ తయారు చేసి అవసరమైనప్పుడు దానిని పదేపదే వేడి చేసి తాగుతారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.. 

టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మారిపోతుంది. చెబు వాసన వస్తుంది. ఇది కాకుండా టీని పదేపదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గుతాయి. బ్యాక్టీరియా పెరుగుతుంది. చాలా సమయం క్రితం చేసిన టీ తాగడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఎందుకంటే టీ చల్లారిన తర్వాత అందులో సూక్ష్మక్రిములు ఏర్పడతాయి. ఈ తేలికపాటి బ్యాక్టీరియా ఆరోగ్యానికి చాలా హానికరం చేస్తుంది. 

ఆయుర్వేద టీకి కూడా ఇదే వర్తిస్తుంది. టీని పదేపదే వేడి చేయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. మీరు ఇలాంటి అలవాటును మార్చుకోకపోతే చాలా కాలం తర్వాత కడుపునొప్పి సమస్యలు వస్తాయి. అంతే కాదు అల్సర్ లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు 15 నిమిషాల తర్వాత టీని వేడి చేస్తే అంది మీకు హాని చేయదు. కానీ చాలా సమయం తర్వాత టీ వేడి చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

 

Leave a Comment