తమిళనాడు బీజేపీ మహిళ నేతను ఆ పార్టీ నాయకుడు లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు శశికళ పుష్ప ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆమెను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు.
అయితే శశికళ మాత్రం అతడి చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. అయినా బాలగణపతి తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఈ వీడియోను డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అతి పెద్ద సమస్య? అని ప్రశ్నిస్తూ విమర్శలు చేసింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అయితే బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇంకా స్పందించలేదు.
பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY
— இசை (@isai_) September 13, 2022