క్యాన్స‌ర్‌తో పాటు ఆ వ్యాధుల‌ నివారణకు బ‌త్తాయి తొక్క వైద్యం..!

బత్తాయిలు చూడటానికి నిమ్మకాయల లాగా కనిపిస్తాయి కానీ, ఆకారము లో నిమ్మకాయ కంటే పెద్దవిగా ఉంటాయి మరియు రుచిలో తియ్యగా ఉంటాయి. రుచికి, బత్తాయిలు కొంతవరకు నారింజ పండు రుచిని  పోలి ఉంటాయి. బత్తాయి పండులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, వీటిలో ఎక్కువ శతము విటమిన్ B9 మరియు విటమిన్ సి లు ఉన్నాయి. బత్తాయిని చెమటను, శరీర దుర్వాసనను పోగొట్టే చికిత్సకు ఉపయోగిస్తారు. 

 బత్తాయి  రక్తాన్ని శుభ్రపరుస్తుంది, అందుకే వివిధ చర్మ సమస్యలు నుంచి మంచి ఊరట కలుగుతుంది. బత్తాయి  జ్యూస్ పగిలిన పెదాలను నయం చేయడంలో  సహకరించెను. బ‌త్తాయిలోనే కాదు బ‌త్తాయి తొక్క‌లోనూ ఎన్నో మంచి ల‌క్ష‌ణాలు ఉన్నాయి అని నిపుణులు  చెబుతున్నారు. 

ఇండియ‌న్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ  ప్ర‌త్యే ప‌రిశోధ‌న‌ల చేసింది.  క్యాన్స‌ర్‌తోపాటు ఇత‌ర ప్రాణాంత‌క వ్యాధుల‌ను నివారించ‌డానికి ఉప‌యోప‌డే ఎన్నో మెట‌ల్ ఐయాన్స్  బ‌త్తాయిలొ  ఉన్న‌ట్టు తెలిపింది.దీనిపై ఇండియ‌న్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ  ప్ర‌త్యేక ప‌రిశోధ‌న‌ల చేసింది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజనీరింగ్, పరిశోధకులు బ‌త్తాయిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. ఇది పర్యావరణ అనుకూలమైంద‌ని, త‌క్కువ ఖర్చుతో యాడ్సోర్బెంట్‌ను సంశ్లేషణ చేయ‌గ‌ల‌ద‌ని  చెప్పారు. బ‌త్తాయి ఎన్నో హెక్సావాలెంట్ క్రోమియం వంటి విషపూరిత హెవీ మెటల్ అయాన్‌లను చెడ్డ  నీరు నుంచి తొలగించగలదని వీరి ప‌రిశోధ‌న‌లో  తెలిసింది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మిశ్రా, అతని విద్యార్థి వీర్ సింగ్ ఈ ప‌రిశోధ‌న చేశారు అని  పరిశోధన సంస్థ చెప్పింది.

క్యాన్సర్లు, కాలేయం వ్యాధులు, చర్మ సమస్యల వంటి అనేక రకాల  సమస్యలకు హెక్సావాలెంట్ క్రోమియం కారణమని మిశ్రా చెప్పారు.బ‌త్తాయి సిట్రస్ లిమెట్టా పీల్స్ బయోమాస్ నుంచి తీసుకున్నా కొత్త పర్యావరణ అనుకూల ఉత్పత్తి అని అన్నారు. వేరే  పద్ధతులతో పోలిస్తే వ్యర్థ జలాల నుంచి హెక్సావాలెంట్ క్రోమియంను తొలగించడానికి ఈ యాడ్సోర్బెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప‌రిశోధ‌న‌పై వీర్ సింగ్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  

మురుగునీటిలో ఈ యాడ్సోర్బెంట్, హెక్సావాలెంట్ క్రోమియం తొలగింపు సామర్థ్యాన్ని ప‌రీక్షించిన‌ట్టు  చెప్పారు. ఇక్కడ యాడ్సోర్బెంట్ సమర్థవంతంగా ప‌ని చేసిన‌ట్టు గుర్తించారు. ప‌రిశోధ‌న‌లో ముందుగా వారు ‘మోసాంబి’ తొక్కలను సేకరించి, వాటిని ఎండబెట్టారు. త‌రువాత వాటిని మెత్తగా చేశారు. అనంత‌రం దానిని చిటోసాన్, బయోపాలిమర్ జ‌త చేశారు. తరువాత నీటిలో ఉంచారు. ఈ ప‌దార్థం నీటీలోని ప‌దార్థాల‌ను వేరు  చేస్తుంది అని ప‌రిశోధ‌కులు చెప్పారు. వీటి మీద ప‌రిశోధ‌న చేసిన మిశ్రా మాట్లాడుతూ ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంతం అయ్యాయి. దీన్ని విస్తృతంగా చేప‌ట్టి ల్యాబ్ స్థాయి నుంచి క్లినిక‌ల్ స్థాయిలో ప‌రిశీలించి ట్ర‌య‌ల్స్ పారంభించిన త‌ర్వాత్త వెంట‌నే ఉత్ప‌త్తి మొదలుపెట్టాలి అన్నారు.

 

Leave a Comment