‘ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది’.. ప్రముఖ నిర్మాత కూతురు..!

ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలే కాదు.. ఇండస్ట్రీలోనూ తారక్ కి అభిమానులు ఉన్నారు. ఈక్రమంలో తారక్ పై టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ ఇన్ ట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. తారక్ వల్లే తన పెళ్లి జరిగినట్లు చెప్పింది.. 

ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనా ప్రేమించిన ప్రసాద్ వర్మతో పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమని తెలిపింది. తన ప్రేమ విషయాన్ని తమ నాన్న అశ్వినీదత్ కి చెప్పడానికి భయపడ్డానని, ఆయన కచ్చితంగా తన ప్రేమను అంగీకరించని తెలుసని చెప్పింది.

 ఈ విషయాన్ని తాను శక్తి సినిమా షూటింగ్ సమయంలో తారక్ కి చెప్పానని, తను వెంటనే ఇంట్లో చెప్పాలని సలహా ఇచ్చారని తెలిపింది. మీ నాన్నతో నేను మాట్లాడుతానని చెప్పి.. షూటింగ్ అయిపోయాక తమ ఇంటికి వచ్చి నాన్నతో తన ప్రేమ విషయం చెప్పారని స్వప్న తెలిపింది. అయితే నాన్న ముందుగా సీరియస్ అయ్యారని, కానీ తారక్ మాటలతో నాన్నను ఒప్పించాడని, తారక్ వల్లే తమ పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చింది. 

Leave a Comment