సస్పెన్స్ థ్రిల్లర్ రెడ్..

ఇస్మార్ట్ శంకర్ యొక్క బ్లాక్ బస్టర్ విజయంతో రామ్ పోతినేని దూసుకెళ్తున్నాడు. నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల రామ్ తో ‘RED’ అనే క్రైం థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. నిదేద, మాళవిక, నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

క్రైమ్ జోనర్ అనగానే అన్ని సినిమాల్లానే రొటీన్ గా ఉండదు. ఇలాంటి జోనర్ కి సస్పెన్స్ చాలా కీలకం. ప్రేక్షకుడి ఊహకు అందకుండా చివరి వరకు సీట్లో కూర్చోబెడితేనే సక్సెస్ సాధ్యమవుతుంది. ఇలాంటి జోనర్లో సినిమాను ఎంత ఆసక్తిగా తీశారో ఈ శుక్రవారం విడుదల అయినా టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. 

‘‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్’’ అంటూ టీజర్ మొదలవుతుంది. టీజర్ లో రామ్ యొక్క రెండు పాత్రలను పరిచయం చేశాడు దర్శకుడు. సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్..డిఫరెంట్ వరల్డ్స్‘ అంటూ పోలీస్ అధికారిణిగా నటించిన నివేద పేతురాజ్ ఇన్వెస్టిగేషన్లో చెప్పేసింది. అయితే ఆ రెండు పాత్రల్లో ఏది నిజం ? ఏది అబద్ధం? ఇంకేదో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందా అనే అనుమానాలు టీజర్ చివరిలో కలిగించారు. 

టీజర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ నేపథ్య సంగీతం. ఈ సినిమాకు అదరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. 

 

Leave a Comment