మాస్క్ ధరించలేదని మహిళపై అత్యాచారం చేసిన పోలీస్..!

కరోనా వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అయితే ఆ మాస్క్ ధరించలేదనే కారణంతో ఓ వివాహితపై పోలీస్ అధికారి ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…

గతేడాది లాక్ డౌన్ సమయంలో సూరత్ లోని ఓ మహిళ మాస్క్ లేకుండా బయటకు వచ్చింది. ఇది గమనించిన ఓ పోలీస్ అధికారి వివాహితను బ్లాక్ మెయిల్ చేశాడు. కేసు పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని తరచూ వేధింపులకు గురిచేశాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. అలా ఏడాదిపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. 

అతడి ఆగడాలు భరించలేక ఆ వివాహిత తాజా పోలీసులను ఆశ్రయించింది. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చూపి తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫొటోలను తీసుకుని ఇప్పటికీ వేధిస్తున్నాడని చెప్పింది. ఈ ఘటన గుజరాత్ లో దుమారం రేపుతోంది. ప్రజా, మహిళా సంఘాలు పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నాయి.  

Leave a Comment