నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియన్.. ‘ఆమె దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే’!

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె నోటి దురుసు దేశం మొత్తం మంటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ప్రాణ హనీ, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశ వ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్ఐఆర్ లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నూపుర్ శర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆమె ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన మాటలు దేశంలో రావణ కాష్టాన్ని రగిల్చిందని, ఆమె వ్యాఖ్యల వల్లే ఉదయ్ పూర్ ఘటన కూడా జరిగిందని వ్యాఖ్యానించింది. ఆమె దేశం మొత్తానికి క్షమపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప.. టీవీ ఛానెల్, నూపుర్ శర్మల డిబెట్ వల్ల దేశానికి ఒరిగిందేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 

సుప్రీం వ్యాఖ్యలపై నూపుర్ శర్మ తరఫు న్యాయవాది మణిందర్ సింగ్ స్పందిస్తూ..ఇప్పటికే ఆమె క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆమెకు ప్రాణ హాని ఉందని తెలిపారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె టీవీ ముందుకొచ్చి యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని, కానీ అప్పటికే ఆలస్యం అయ్యిందని వ్యాఖ్యానించింది. ఆమెకు ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోందని మండిపడింది. 

నూపుర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేశాయని, పార్టీ అధికార ప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడవచ్చా అంటూ ప్రశ్నించింది. డిబెట్ పెట్టిన టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలని, దేశంలో ఏం జరిగినా చర్చ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బెంజ్ పేర్కొంది.  దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెదే బాధ్యత అని పేర్కొంద. 

ఢిల్లీ పోలీసులపై కూడా సుప్రీం కోర్టు మండిపడింది. ఫిర్యాదు నమోదైన తర్వాత ఏం చేశారని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆమె ఫిర్యాదు మీద ఒక వ్యక్తిని అరెస్ట్ చేేశారని, ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్ లు నమోదైనా.. ఎందుకు ఆమెను టచ్ చేయలేకపోయారని సుప్రీం కోర్టు నిలదీసింది. నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లు అన్నింటిని కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది.   

 

 

Leave a Comment