బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు చురకలు..!

అలోపతి వైద్యాన్ని బాబా రాందేవ్ విమర్శిచండపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదని సీరియస్ అయ్యింది. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారని బాబా రాందేవ్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి. 

అలోపతి వైద్యులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని రాందేవ్ ని ప్రశ్నించింది. యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన రాందేవ్ ఇతర వ్యవస్థలను విమర్శించడం సరికాదని హెచ్చరించింది. ఆయన అనుసరించే విధానాలతో అన్నిరకాల వ్యాధులు నయమవుతాయని గ్యారెంటీ ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆయుష్ కంపెనీ ద్వారా బాబా రాందేవ్ చేసిన ప్రకనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది.  

 

 

Leave a Comment